Description
School safety debate: రాప్తాడు, పంచకుల ఘటనల తర్వాతైనా బడుల్లో పిల్లల భద్రతకు వ్యవస్థ నిర్మిస్తామా, లేక మరో చిన్నారి గాయపడే వరకు ఎదురుచూస్తామా? బిగ్ న్యూస్ డిబేట్ ప్రారంభంలో వినిపించిన ప్రశ్న ఇది.
అనంతపురం జిల్లా రాప్తాడులో బయటి వ్యక్తి తరగతి గదిలోకి చొరబడ్డాడు. హర్యానాలోని పంచకులలో ఓ పాఠశాల చిన్నారిపై దాడి వెలుగులోకి వచ్చింది. బడి భద్రత అంటే గేటుకు తాళం వేయడం మాత్రమే కాదని, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, వారి కోపం, భయాన్ని గమనిస్తున్నామా అని బిగ్ న్యూస్ ప్రశ్నించింది. మార్కులు, ర్యాంకులతో పాటు కోపాన్ని అదుపు చేసుకోవడం, మరో మనిషి బాధను అర్థం చేసుకోవడం నేర్పుతున్నామా అని అడిగింది. ప్రతి పాఠశాలలో బయటి వ్యక్తుల ప్రవేశానికి నియంత్రణ, బెదిరింపులకు గురైన పిల్లలు చెప్పుకునే వ్యవస్థ, ఉపాధ్యాయులకు ప్రమాద సంకేతాలు గుర్తించే శిక్షణ ఉండాలని, పిల్లల భద్రత అదృష్టం మీద కాదు, వ్యవస్థ మీద ఆధారపడాలని స్పష్టం చేసింది.
In this school safety debate opening, BIG NEWS takes up the Raptadu (Anantapur district, Andhra Pradesh) and Panchkula (Haryana) school incidents: a threat from an outsider in one school and from a fellow student in another. Schools need emotional safety along with physical security, control over who enters, someone a threatened child can tell, and teachers trained to spot danger signs. Wishing both children a full recovery, the show asks that we do not stop at prayers and build the system before another child is hurt.
#TV5News #Raptadu #SchoolSafety
