బడిలోనూ భయమే..! Child Safety in Schools, Rayapati Sailaja, Haryana Case || TV5 News

TV5 News Video 3 days ago

Description

Child safety in schools: రాప్తాడు స్కూల్ ఘటన, హర్యానా ఘటనల నేపథ్యంలో బిగ్ న్యూస్ చర్చలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ ఫోన్ లైన్‌లో మాట్లాడారు. బడిలో ఉన్నా ఆడపిల్లలకు భయమేనా అన్న ప్రశ్నపై సాగిన చర్చ ఇది.

ఆడపిల్లను బయటికి పంపాలంటేనే భయమేస్తోందని తల్లిదండ్రులు అంటున్నారని, ఇలాంటి కేసుల్లో శిక్షకు నెలలు, ఏళ్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. పోలీసులు రోజూ స్కూళ్లకు వెళ్లి అవగాహన సెషన్లు పెడుతున్నా, ఆడపిల్లలు ఇంట్లో, స్కూల్లో భయం లేకుండా చెప్పుకునే వ్యవస్థ, ఫిర్యాదులకు ఒక ఫెయిర్ సిస్టమ్ రావాలన్నది ఆమె సూచన. వేల మంది ఆడపిల్లలు చదివే స్కూళ్లకు సరైన సెక్యూరిటీ లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చర్చలో విజ్ఞప్తి వినిపించింది.

In a TV debate after the Raptadu school incident and the Haryana case, AP Women Commission chairperson Dr Rayapati Sailaja asked why punishment takes months and years, and called for a fearless complaint system for girls at home and in schools. The panel also raised school security, with an appeal to take it to the education minister.

#TV5News #GirlsSafety #Raptadu