పోలింగ్ భద్రత ఎలా? AP SEC Press Meet, Anil Chandra Punetha in Vijayawada || TV5 News

TV5 News Video 3 days ago

Description

AP SEC press meet: రేపటి (నవంబర్ 1) మున్సిపల్ పోలింగ్ భద్రత, కెమెరాల నిఘా, సిబ్బంది ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, అధికారులు విజయవాడలో వివరించారు.

మొత్తం 36,351 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ లొకేషన్లలో అదనపు పోలీసులు, డీఎస్పీ, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సెస్, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సమస్యాత్మక ప్రాంతాల్లో 130 ప్లటూన్ల ఏపీఎస్‌పీ బలగాలు, డీఐజీ, ఐజీల ఆధ్వర్యంలో క్విక్ రియాక్షన్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు 1,543 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశారు. 13 కార్పొరేషన్లలో 922 డివిజన్లకు 3,073 మంది, మున్సిపాలిటీల్లో 2,382 వార్డులకు 6,669 మంది పోటీలో ఉన్నారు. 6,600 లొకేషన్లలో దాదాపు 12 వేల కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీతో నిఘా ఉంటుంది. 75 వేల మంది పోలింగ్ సిబ్బంది రాత్రి 8 గంటలకల్లా కేంద్రాలకు చేరుకుంటారు. రేపు ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలు విడుదల చేస్తారు. ఈసారి పోలింగ్ శాతం సగటును దాటుతుందని ఎస్ఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

At the AP SEC press meet in Vijayawada, State Election Commissioner Anil Chandra Punetha and officials laid out the arrangements for the November 1 urban local body polls: 36,351 police and special forces, 1,543 route mobiles to move ballot boxes, about 12,000 cameras across 6,600 polling locations with webcasting and videography, and 75,000 polling staff. Turnout figures will be released every two hours on polling day.

#TV5News #APMunicipalElections #AnilChandraPunetha