Description
#raithunestham InsightsOfGaushala, #Gaushala, #GaushalaManagement, #CowCare, #DesiCow, #CowFarming, #DairyFarming, #AnimalHusbandry, #VeterinaryScience, #RythuNestham, #RythuNesthamPublications, #OrganicFarming, #IndianAgriculture, #TeluguAgriculture, #PadmaShri
గోశాలల సమర్థవంతమైన నిర్వహణ కోసం రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన " ఆదర్శ గోశాలలు ఎలా ఉండాలంటే..." పుస్తకం.. గో ప్రేమికులు, గోశాలల నిర్వాహకులు, రైతులు, పశువైద్య విద్యార్థుల ఆదరణ పొందింది. ఈ విస్తృత సమాచారాన్ని జాతీయ స్థాయిలో రైతులకి అందించేందుకు " ఆదర్శ గోశాలలు ఎలా ఉండాలంటే...'" పుస్తకాన్ని Insights of Gaushala పేరుతో ఇంగ్లీష్ భాషలోకి అనువదించి ప్రచురించింది రైతునేస్తం పబ్లికేషన్స్. డాక్టర్ ఆలువాల అంజయ్య, డాక్టర్ ములగలేటి శివరామ్ రచించిన ఈ పుస్తక ఆవిష్కరణ 2026 జూలై 1న హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని సురానా ఆడిటోరియం హాల్ లో జరిగింది. పద్మశ్రీ పురస్కాహ గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ పున్నియ మూర్తి నటేశన్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డాక్టర్ యం జ్ఞానప్రకాశ్.... తెలంగాణ పశువైద్య మరియు పశుసంవర్థక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ బి. సుబ్బారాయుడు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన విశ్రాంత పశువైద్యులు డాక్టర్ మధుసూదన్ శర్మ.... రైతునేస్తం పబ్లికేషన్స్ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రొఫెసర్ డాక్టర్ పున్నియ మూర్తి నటేశన్ గారిని ఘనంగా సన్మానించారు. పుస్తక రచయితలు, అనుసంధాన కర్తలను సత్కరించారు.