కడప దళిత యువకుల కేసులో కీలక మలుపు | ఘటనాస్థలానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ | E6TV

E6TV Podcast 4 days ago

Description

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో ఐదు నెలల క్రితం సంచలనం సృష్టించిన దళిత యువకులు సతీష్, ఓబులేష్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది.

ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. కమిషన్ సభ్యులు దాసు, శ్రీపతి బాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్‌తో కలిసి పర్యటించిన ఆయన, మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ఈ కేసును ఎస్సీ కమిషన్ అత్యంత సీరియస్‌గా తీసుకుందని, ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో త్వరితగతిన విచారణ జరిపించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు ఉంటాయని జవహర్ హామీ ఇచ్చారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు.
#Kadapa #Brahmamgarimatham #SCCommission #Dalit #AndhraPradesh #BreakingNews #Satish #Obulesh #Justice #TeluguNews #E6TV #APNews #Investigation #NewsUpdate
Welcome to E6TV – Your trusted source for Breaking News, Telugu Political Updates, Live News Coverage, and Exclusive Reports from Andhra Pradesh, Telangana, India & across the globe.
Stay updated with the latest:AP & TS Political Developments
Government Schemes & PoliciesCrime Reports Exclusive Interviews Public Opinion Viral News & Social Media TrendsEntertainment, Sports & Weather Updates
#E6TV #TeluguNews #BreakingNews #LiveUpdates #APPolitics #TSPolitics
#E6news #political #news #india #e6tvnews #breakingnews #newupdates #telngana #cm #pm #primenews #politics